రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు వశీకర్ ఎంపిక

12-11-2026 | 04:43pm

సూర్యాపేట జిల్లాకు గుర్తింపు తెచ్చిన విద్యార్థి

నేరేడుచర్ల,(విజయక్రాంతి): 70వ ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌-14 బాలుర వాలీబాల్(SGFI Under 14 Volleyball) రాష్ట్ర స్థాయి పోటీలకు సూర్యాపేట జిల్లా(Suryapet District)కు చెందిన విద్యార్థి కొడిద వశీకర్ ఎంపికయ్యాడు. గురువారం భువనగిరిలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్‌ కమ్‌ సెలక్షన్స్‌లో సూర్యాపేట జిల్లా తరఫున పాల్గొన్న వశీకర్ అద్భుతమైన ఆటతీరుతో ప్రతిభ చాటుకుని రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో వశీకర్ నల్గొండ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు.

వశీకర్ రాష్ట్ర స్థాయి పోటీల)State Level Competitions_కు ఎంపిక కావడంపై పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ భరత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. తమ కుమారుడు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై తండ్రి కొడిద మనోజ్ కుమార్, తల్లి కొడిద అపర్ణ హర్షం వ్యక్తం చేశారు. వశీకర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని పలువురు క్రీడాభిమానులు, స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు