కర్రేగుట్టల భూములకు పట్టాలు ఇవ్వాలి
ఏ ఎన్ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కంతి విజయ్ .
వెంకటాపురం, నూగూరు, నవంబర్ 12 ,విజయ క్రాంతి: పాలకులు ఆదివాసీ చట్టాలను(Rulers are subject to tribal laws), ఆదివాసీలను విస్మరిస్తున్నారని ఆదివాసీ నవనిర్మాణ సేన(Adivasi Navanirmana Sena) జిల్లా ఉపాధ్యక్షులు కంతి విజయ్ ఆరోపించారు. శతా బ్దాలుగా ఆదివాసీలు డోలి జెల్లా చెలిమల, తడపల, పామునూరు, ముకునూరు గ్రామాల్లో ఆదివాసీలు జీవించినట్టు ఆయన తెలిపారు.
గురువారం ఆదివాసీ నవనిర్మాణ సేన ములుగు జిల్లా ఉపాధ్యక్షులు కంతి వెంకటాపురం లోని ప్రభుత్వ రోడ్డు భవనాల విశ్రాంతి భవనం లో జరిగిన కార్యకర్తల సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వందల ఏళ్లుగా సాగులో ఉన్న ఆదివాసీల భూములను ఆన్లైన్ నుండి తొలిగించడం అన్యాయం అన్నారు.
ఎల్ టి ఆర్, పెసా చట్టాలను ఉల్లంఘించి ఆదివాసీల పట్టా భూములను ఆన్లైన్ నుండి తొలిగించడం సరికాదు అన్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఉన్న గిరిజనేతరులను ఎందుకు తొలిగించడం లేదని ప్రశ్నించారు. ఎల్ టి ఆర్ చట్టాన్ని ఉల్లాంఘీంచిన గిరిజనేతరులకు రక్షణ కల్పిస్తూ, గిరిజన గ్రామాలను నిబంధనలకు విరుద్ధంగా డిజెక్టెడ్ గ్రామాలుగా ప్రకటించడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు వాసం నారాయణ, మడకం ప్రకాష్, నక్క నారాయణ. తదితరులు పాల్గొన్నారు..