కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు సిద్ధం
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి దివాకర్ గౌడ్
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో(Government hospitals) పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మెకు దిగుతామని జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి దివాకర్ గౌడ్ హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలిపి ఆర్ఎంఓ డాక్టర్ తిరుమలేష్‌కు వినతిపత్రం అందజేశారు.
కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం, బోనస్, చట్ట ప్రకారం సెలవులు, ప్రతినెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే నవంబర్ 28 నుంచి సమ్మె చేపడతామని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, నీల, మాలతి, పద్మ, ప్రమీల, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.