పీడీఎస్ బియ్యం పట్టివేత
పెంచికల్‌పేట్ (విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న నాలుగున్నర క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పెంచికల్‌పేట్ పోలీసులు(Penchikalpet Police) స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద గురువారం ఉదయం 11 గంటల సమయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ట్రాలీ ఆటోలో తరలిస్తున్న బియ్యాన్ని గుర్తించినట్లు ఎస్సై అనిల్ కుమార్(SI Anil Kumar) తెలిపారు.
దహెగాం మండలం ఒడ్డుగూడ నుంచి కౌటాలకు బియ్యం తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.