గిరిజన సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక నిధులు
05-11-2026 | 08:21pm
ఆసిఫాబాద్, నవంబర్ 5 (విజయ క్రాంతి): ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress People's Government) ప్రత్యేక నిధులు కేటాయించిందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తెలిపారు. కెరమెరి మండలం కరంజివాడ గోండ్ గూడలో నిర్వహించిన గుస్సాడి, దండారి వేడుకల్లో ఆమె పాల్గొని నృత్య ప్రదర్శనలను తిలకించారు. గిరిజన కళలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బల్వంత్, కాంగ్రెస్ నాయకులు, ఆదివాసీ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.