గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సత్యానికి అవకాశమివ్వాలి
బీసీ జేఏసీ రౌండ్టేబుల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
ఖైరతాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాం తి): బీసీ ఉద్యమ నాయకుడు, చేనేత కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం(National BC Welfare Association) జాతీయ ఉపాధ్యక్షు డు గుజ్జ సత్యంకు తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకా శం కల్పించాలని సోమాజిగూడలో నిర్వహి ంచిన బీసీ జేఏసీ రౌండ్టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.బీసీల హక్కుల సాధన, చేనేత కార్మికుల సంక్షేమం, విద్యా, వైద్య, కార్మిక, మీడియా రంగాల్లో ఆయన చే స్తున్న సేవలను గుర్తించాలని వివిధ బీసీ సం ఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులను కేవలం రాజకీ య ప్రయోజనాల కోసం కాకుండా, సమాజానికి విశేష సేవలు అందించిన వ్యక్తులకు అవకాశం కల్పించే విధంగా వినియోగించాలని సూచించారు. బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం,స్థానిక సంస్థ ల్లో 42 శాతం రిజర్వేషన్లు, కులగణనలో తగిన గుర్తింపు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల పరిష్కారం,
ప్రత్యేక సంక్షే మ నిధుల సాధన వంటి అంశాలపై గుజ్జ స త్యం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన ఆయన చేనేత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారని, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక, మార్కెటింగ్ సమస్యలపై ప్రత్యక్ష అవగాహన కలిగి ఉన్నారని తెలి పారు. ఉప్పల్లోని పద్మశాలి హ్యాండ్లూమ్ టె క్స్టైల్ మార్కెట్ నిర్వహణతో పాటు విద్యా సంస్థలు,
వైద్య సేవలు,మీడియా రంగాల్లో నూ బాధ్యతలు నిర్వహిస్తున్నారని వివరించా రు. రాజకీయ పదవుల కంటే సామాజిక సేవకు ప్రాధాన్యం ఇచ్చి,బీసీలు,చేనేత కార్మికులు, విద్యార్థులు, వెనుకబడిన వర్గాల సమ స్యలను శాసనమండలిలో ప్రస్తావించే అవకాశం గుజ్జ సత్యంకు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వీహెచ్ హనుమంతరావు, నారగోని, నర్సింగ్ రావు, ధనంజయ, జయంతి గౌడ్, రఘురాం, తదితరులు పాల్గొన్నారు.