కరకవాగులో ఇద్దరు యువకుల మృతి!

18-10-2026 | 10:09am

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని కరకవాగు ప్రాంతంలో ఉన్న కెన్నెరసాని కాలువలో మునిగి శనివారం ఇద్దరు యువకులు మృతి చెందడం విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళ్తే.. చుంచుపల్లి మండలం రామవరం ప్రాంతానికి చెందిన తుడుం భరత్ (23), ఎస్కే సమీర్ (24) కరకవాగులో ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఇదిలా ఉండగా, యువకులు ఆ ప్రాంతంలో మద్యం సేవించి నీటిలో దిగినట్లు ప్రచారం సాగుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు