బెల్లంపల్లి ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్‌లో సీపీ తని

18-10-2026 | 10:06am

బెల్లంపల్లి, విజయక్రాంతి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం బెల్లంపల్లి ఆర్ముడ్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హెడ్‌క్వార్టర్స్‌లోని ఆర్‌ఐ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, స్టోర్ రూమ్, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఆర్‌ఐ సంపత్‌తో మాట్లాడి హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు, విధుల కేటాయింపు, స్పెషల్ పార్టీ సిబ్బంది విధులు, ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాలపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా హెడ్‌క్వార్టర్స్‌ పరిసరాలను పరిశీలించారు.

పోలీస్ కార్యాలయాలు, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, క్రమబద్ధంగా, సౌకర్యవంతమైన వాతావరణంలో ఉంచేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

మరిన్ని వార్తలు