సిరికొండలో ఆగని అక్రమ కలప

02-11-2026 | 05:15am
  1. వందల చెట్లు నరికివేత
  2. చోద్యం చూస్తున్న అధికారులు 

సిరికొండ, నవంబర్ 1 (విజయ క్రాం తి) : నాడు  దట్టమైన అడవి నేడు వెల వెల బోతోంది. అధికారులు(Officials) అలసత్వం ,పర్యవేక్ష ణ, స్థానికంగా అందుబాటులో లేకపోవడ ంతో విలువైన చెట్లు గొడ్డలి వేటుకు నేలకొరుగుతున్నాయి.ఓ వైపు ప్రభుత్వం(Government) మొక్కలు నాటే కార్యక్రమం లక్ష్యంతో తీసుకుని మొ క్కలు  నా టిస్తుంటే  అధికారుల క్షేత్ర స్థా యిలో పర్యవేక్షణ పోవడంతో విలువైన టేకు దుంగలు దొంగల సొంతమవుతున్నాయి.

సి రికొండ మండలంలోని రావుట్ల,మెట్టు త ండా, జంగిలోడి తండా, జినిగ్యాల్,పంది మ డుగు, తుంపల్లి, పాకాల, న్యావనంది గ్రామా లు  అడవి ప్రాంతానికి ఆనుకొని ఉన్నాయి. గడిచిన రెండు నెలలలో వందల సంఖ్యలో ఫారెస్ట్ అధికారులు టేకు దుంగలు స్వాధీ నం చేసుకున్నారు.

రెండు నెలల్లోనే వందల సంఖ్యలో విలువైన చెట్లు గొడ్డలి వేటుకు గు రవుతుంటే ప్రతీ ఏడాది వేల సంఖ్యలో చెట్లు నరికివేత గురవుతున్నాయని స్థానికులు ఆవేదన చేందుతున్నారు. అధికారులు ‘మాము లు’గా వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

పర్యవేక్షణ కరువు

ఫారెస్ట్  సిబ్బంది అధికారులు అందుబాటులో లేకపోవడంతో  వందల టేకు దుంగ లు దొంగలు సమిళ్లకు,నివాస గృహాలకు , తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. బేస్ క్యాంపు, నైట్ పెట్రోలింగ్  చేయడం లేదని , పర్యావరణ ప్రేమికులు ఆరోపిస్తున్నారు. చెట్లు గొడ్డలి వేటుకు గురికాకుండా పహరా కాసి దొంగలను పట్టుకుని అడవిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు