మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) చిన్న గూడూరులో(Chinna Gooduru) షేర్, జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్ చిత్తారి సోమన్న అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyotirao Phule) 136వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్న గుడురు గ్రామ సర్పంచ్ బత్యెం రమేష్, చిత్తారి సోమన్న తదితరులు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చిత్తారి సోమన్న మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలైన విద్య, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. షేర్, జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్స్ పోస్టర్ ఆవిష్కరణ చేసి బాల్య వివాహాలు చేయడం చట్ట రీత్యా నేరం బాల్య కార్మికులను కుడా పనిలో పెట్టుకోవద్దని అలా పెట్టుకుంటే చట్టం ప్రకారం కెసులు అవుతాయని ఎక్కడయినా బాల్యవివాహాలు బాల కార్మికులు ఉన్నట్లు సమాచారం తెలిస్తే షేర్ ఎన్జీవో కు ,1098,100 సమాచరం ఇవ్వాలని కోరారు.