అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

14-11-2026 | 04:44pm

నిర్మల్,(విజయక్రాంతి): ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) నిర్మల్ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని యూనియన్ నాయకులు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని యూనియన్ నాయకులు వివరించారు. అయినప్పటికీ అనేక మంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో పాటు నివాస సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఈ విషయంలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు. ఈ నెల 25న జరిగే జిల్లా మహాసభల్లో జర్నలిస్టుల సమస్యలు, హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన అంశాలపై చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతులు వివరించారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య, జాతీయ కార్యవర్గ సభ్యులు గాండ్ల రాజశేఖర్, జిల్లా కోశాధికారి వీ. ప్రశాంత్, జిల్లా సోషల్ మీడియా  కన్వీనర్ డి. యోగేష్, జిల్లా ఉపాధ్యక్షులు గుమ్ముల అశోక్, పూసాల పోశెట్టి, వేణుగోపాల్, తన్వీర్, జిల్లా కార్యదర్శులు జల్ద మనోజ్, హనుమాన్లు, భోజా రెడ్డి, రాజేశ్వర్, డీఎస్ మధు, గంగాధర్, చంద్రశేఖర్, సాయిరాజ్ గౌడ్, శివరామకృష్ణ, శ్రీనివాస్, భోజన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు