విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
* ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారంతో బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరిహారం
దేవరకద్ర నవంబర్ 3 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన శివ మల్లేష్ గత సంవత్సరం విద్యుత్ షాక్‌తో మృతి చెందగా, ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి(MLA G. Madhusudhan Reddy) సహకారంతో మంజూరైన ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సక్కేరి రామాంజనేయులు,ఉపసర్పంచ్ పింజరి మోహన్, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ సక్కేరి రామాంజనేయులు మాట్లాడుతూ.. శివ మల్లేష్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని, వారికి ఏ అవసరం వచ్చినా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా సహకరించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.