ఎల్‌నినోను కూడా రాజకీయం చేస్తారా?..

03-11-2026 | 08:44pm

హరీశ్‌రావుకు ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రశ్న

దేవరకద్ర: ఎల్‌నినో ప్రభావాన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి(MLA Madhusudan Reddy) అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోయిల్‌సాగర్, భీమా ఆయకట్టు రైతులకు చివరి తడి వరకు సాగునీరు అందించామని, కర్ణాటక నుంచి నీటిని తీసుకొచ్చి పంటలను కాపాడామని తెలిపారు.

ప్రభుత్వం ఎక్కడా పంటల విరామం ప్రకటించలేదని, నీటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎందుకు పూర్తి చేయలేకపోయారని మాజీ మంత్రి హరీశ్‌రావును ప్రశ్నించారు. వచ్చే జూన్ నాటికి కరివేన వరకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు