బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
ఉట్నూర్, నవంబర్03 ( విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం(Indravelly Mandal) పిట్ట బొంగరం గ్రామపంచాయతీ(Pitta Bongaram Gram Panchayat) పరిధిలోని ఓలమాద్రి గ్రామ క్రాస్ రోడ్ వద్ద వేగంగా ఉన్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఇద్దరినీ జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు.
కొమరం భీం జిల్లా లింగాపూర్ మండలంలోని దంపూర్ గ్రామానికి చెందిన మండండి కిషన్(25), సిదాం కృష్ణ (24) ద్విచక్ర వాహనంపై ఇంద్రవెల్లి మండలంలోని డాగర్ గావ్ గ్రామంలో దండారి ఉత్సవాలకు అవసరమైన డప్పులను తీసుకు వెళ్ళుటకు మంగళవారం చేరుకున్నారు.
డప్పులను సిద్ధం చేసుకుని తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై వేగంగా ప్రయాణం చేస్తూ ప్రమాదానికి గురయ్యారని పిట్ట బొంగరం గ్రామ సర్పంచ్ మాడవి ఇంద్రదేవ్ తెలిపారు. ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని సర్పంచ్ వివరించారు. 108 అంబులెన్స్ లో రిమ్స్ కు తరలించి వారి బంధువులకు సమాచార అందించినట్లు సర్పంచ్ తెలిపారు.