భూత్పూర్లో ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు
28-11-2026 | 10:01pm
భూత్పూర్: భూత్పూర్ మండల కేంద్రంలోని శనివారం జ్యోతిరావు పూలె వర్ధింతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ హర్యానాయక్ రాజకీయ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హర్యానాయక్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే చేసిన సేవలను ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ సాధిఖ్, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు, సింగల్ విండో డైరెక్టర్ బోరింగ్ నర్సింహులు, పట్టణ నేతలు మండి వెంకటయ్య, బజారు పరశురాం, గడ్డం శ్రీను, భీంరాజ్, శంకర్, అంజి., ముని, కురుమూర్తి, నరేష్ యాదవ్, జగన్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.