ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే గారి వర్ధంతి
రాజాపూర్ నవంబర్ 28: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాత్మ జ్యోతిరావు పూలే(Jyotirao Phule) సేవలు వెలకట్టలేనివని తిర్మలాపూర్ గ్రామ సర్పంచ్ సంతోష వెంకటేష్(Thirmalapur Sarpanch Santhosha Venkatesh) అన్నారు. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే మహిళల విద్య అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. నేటి యువతరం మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ మన దేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్ పిసిసి ఉపాధ్యక్షులు యాదయ్య అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నరేష్ వార్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి,శ్రీశైలం,నాయకులు సత్యనారాయణగౌడ్ నర్సింలు,శ్రీనివాస్, సి నర్సింలు అనిల్ కుమార్ జగన్,రాధాకృష్ణ, శ్రీశైలం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.