ఎమ్మెల్సీ బరిలో దివ్యాంగుల ఇన్‌చార్జ్‌గా వీరేష్
విజయక్రాంతి, హన్వాడ, అక్టోబర్ 29: హన్వాడ మండల కేంద్రానికి చెందిన ఎం. వీరేష్ కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. రానున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వికలాంగుల హక్కులు, సంక్షేమం, ఎన్నికల్లో వారి భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో వికలాంగుల విభాగం ఇన్‌చార్జిగా ఆయనను నియమించింది.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. దివ్యాంగ ఓటర్లను సమన్వయం చేయడం, వారి తరఫున ఎన్నికల వ్యూహాలు రూపొందించడం, సమస్యలను ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించే బాధ్యతలను వీరేష్ కుమార్‌కు అప్పగించారు.
ఈ సందర్భంగా నూతన ఇన్‌చార్జి వీరేష్ కుమార్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగ ఓటర్లను సమన్వయం చేస్తూ, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం చేశారు.
వీరేష్ కుమార్ నియామకంపై పలువురు దివ్యాంగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.