దేశంలో అస్థిరతకు కాంగ్రెస్ కుట్రలు

18-10-2026 | 05:15am
  1. ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం
  2. తెలంగాణ, కర్ణాటక, కేరళలో ఎలా గెలిచారు?
  3. విఘాతం సృష్టించే శక్తులతో చేతులు కలపడం సరికాదు
  4. కాంగ్రెస్‌పై మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్

మహబూబ్‌నగర్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ విదేశీ శక్తులతో చేతులు కలుపుతోందని, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ(Mahabubnagar MP DK Aruna) ఆరోపించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కొత్త ప్రక్రియ కాదని, గతంలో ఎనిమిదిసార్లు జరిగిందని తెలిపారు.

ఆరుసార్లు కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని గుర్తు చేశారు. రెండుసార్లు ఓటు నమోదైనవారు, మరణించినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నారని వివరించారు. 13 కోట్ల ఓట్లు తొలగించారంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఈ ప్రక్రియను చేపడుతోందన్నారు. అర్హత ఉన్న వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకపోతే ఫారం ద్వారా మళ్లీ నమోదు చేసుకోవచ్చని సూచించారు.

ఓట్ల చోరీ జరిగిందంటున్న కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఎలా గెలిచిందని నిలదీశారు. ఓటర్ల జాబితా సవరణపై తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, ఈ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. దేశ సమగ్రతకు విఘాతం కలిగించే శక్తులతో రాజకీయ ప్ర యోజనాల కోసం చేతులు కలపడం సరికాదన్నారు. 

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక ల కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.  సమావేశం లో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప ద్మజారెడ్డి, కార్యవర్గ సభ్యులు రతంగ్ పాండురెడ్డి, జనార్దన్‌రెడ్డి, రఘురామయ్య, కార్పొరేటర్లు కిరణ్ కుమార్‌రెడ్డి, రమేష్, జ్యోతి,  బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు