నూతన చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ
నలుగురు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పేపర్లు అందజేసిన గ్రామ సర్పంచ్
జడ్చర్ల: బండమీదిపల్లి గ్రామం(Bandameedipally village)లోని నూతన చేయూత పెన్షన్(Cheyutha Pension) లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిట్యాల మల్లమ్మ, చిట్యాల పార్వతమ్మ, రాళ్లబావి పద్మ, సిద్దయపల్లి తిరుపతమ్మలకు ప్రొసీడింగ్ పేపర్లను గ్రామ సర్పంచ్ సత్యమొల పాండు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యమొల పాండు, ఉపసర్పంచ్ దొర్వి నాగలక్ష్మి మల్లేష్, వార్డు సభ్యులు కొత్తోల్ల చిన్న పెంటయ్య, దొర్వి రమేష్, చిట్యాల సురేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.