బెల్లంపల్లిలో డెత్ పాలిటిక్స్

26-11-2026 | 05:25am
  1. కాంగి, గులాబీల వైరం - 
  2. సర్టిఫికెట్ల కేసు మమ...-
  3. విచారణ ముగిసిందా..?- 
  4. సూత్రదారులను తప్పించారా..?- 
  5. చిరుద్యోగులే బలిపశువులు..

బెల్లంపల్లి, నంబర్ 25 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో(Bellampalli, Mancherial district,) వెలుగుచూసినా అనధికార డెత్ సర్టిఫికెట్ల రాకెట్(Death Certificate Racket) అధికార, ప్రతి పక్ష పార్టీ మధ్య వైరానికి తెరలేపింది. ఈ రాకెట్ వెనుక ఎమ్మెల్యే ప్రధాన అనుచరవర్గం ఉం దని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(Durgam Chinnayya) చేసిన ఆరోపణలు జిల్లాలో సంచలన ంగా మారాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్(Beard Vinod) ను లక్ష్యంగా ప్రతి పక్ష నేత మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(Durgam Chinnayya) రాజకీయ దాడీ చేశారు. ఈ డె త్ సర్టిఫికెట్ల దందాకు ఎలాంటి సంబంధం లేని మాజీ సీఎం కేసీఆర్(KCR) పై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బెల్లంపల్లి డెత్ సర్టిఫికెట్ల రాకెట్ ను ప్రయోగించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

కుంభకోణం చేసింది అధికార పా ర్టీనేతలైతే.. మధ్యలో బీఆర్‌ఎస్ నేతలు, మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావనేందని లేవనెత్తిన ప్రశ్నపై జిల్లాలో చర్చ జోరుగా జరుగుతో ంది. డెత్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు జరిగాయని స్వయాన అధికారులే అంగీకరిస్తు న్నారు. ఇందులో కాంగ్రెస్ నేతల హస్తం ఉం దని, ఓవైపు సమాజం కోడై కూస్తున్నది. అవినీతి అక్రమాల నుంచి పలుకుబడితో బయ ట పడినంత మాత్రానా? కాంగ్రెస్ నేతలకు సర్టిఫికెట్ల జారీతో సంబంధం లేకుండా పోత దా..? అని బీఆర్ ఎస్ శ్రేణులు వాదిస్తున్నారు..

బెల్లంపల్లి మండలం బూధఖుర్దు పంచాయతీ కేంద్రంగా జరిగిన డెత్ సర్టిఫికెట్ల అక్రమాలు, స్థానిక కాంగ్రెస్ నాయకులకే ఎందుకు చుట్టుకుందనేది ఇక్కడ ప్రధాన చర్చ నీయాంశంమైంది. ప్రజావాణిలో డెత్ సర్టిఫికెట్ల అవినీ తిపై బీఆర్‌ఎస్ కు చెందిన మాజీ జడ్పీవైస్ చైర్మన్, ఉప సర్పంచు జిల్లా కలెక్టర్ కు సాక్ష్యాధారాలతో ఉప్పందించారు. అప్పటికే డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంపై పత్రికలో వార్త కథనాలు వచ్చాయి.

ఈ ఫిర్యాదుతో డెత్ స ర్టిఫికెట్లపై అధికారులు  అప్రమత్తం అయ్యా రు. వెంటనే  అందుకు కారణమైన పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారి కంప్యూటర్ ఆపరేటర్ తో సహా ఐదుగురిపై పోలీసులకు ఎంపీవో ఫిర్యాదు చేశారు. సక్రమంగానే సర్టిఫికేట్లు జారీ జరిగినట్టు  అయితే.. పోలీ సులకు ఫిర్యాదు చేసే పరిస్థితి  ఎందుకు దారితీస్తుందని, దానికి కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.  

గులాబీ, హస్తం మధ్య రగడ...

జిల్లాలో కాంగ్రెస్, గులాబీ పార్టీల మధ్య  డెత్ సర్టిఫికెట్ల దందా రగడను సృష్టించింది. ఎంతో కాలంగా సాగుతోన్న ఈ చీకటి వ్యవహారం అనూహ్యంగా బట్ట బయలు అయ్యిం ది.. పక్కగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగుతోన్నదన్న ప్రచారం ఈ కేసులో ఇరుకున్న కారొబారు రవి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఈ దందా గుట్టును విప్పారు. అప్పటి వరకు అధికార పార్టీ నేతలపై వినిపించిన గుసగుసలు, అనుమానాలు నిజమ య్యాయి. ఈ రకంగా  పార్టీ అధికార పార్టీపై ఆధిపత్యం సాధించారు. రాజకీయంగా పైచే య్యి  సాధించారు.

మండలంలో డెత్ సర్టిఫికెట్ల అవినీతిని మూట కట్టుకున్నారు. ప్రజ ల్లో బదునామయ్యారు. ఈ దెబ్బకు తట్టుకోలేక కాంగ్రెస్ నేతలు డెత్ సర్టిఫికెట్ల అ క్రమాలకు అస్సలు సంబంధం లేదని సంజాయిషీ ఇచ్చే పరిస్థితికి నెట్టబడ్డారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేసి తొలుత ఐదుగురినీ మాత్రం జైలుకు పంపించారు.  మరికొంద రూ ఇందులో ప్రధాన పాత్రదారులు ఉండ గా, ఒక్కరు మాత్రమే పరారీలో ఉన్నారని పోలీసులు ప్రకటించడం గమనార్హం. - 

అధికార పార్టీలో గుబులు..

అక్రమ సర్టిఫికెట్ల వ్యవహారం కాంగ్రెస్ పార్టీ నేతలల్లో గుబులు రేపుతోంది. ఈ అక్రమాలతో తమకెలాంటి సంబంధం లేదని కుయ్యోమొర్రో అని నెత్తినోరు నాసుకుంటున్నారు. అయినప్పటికీ ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. ఈ నేపథ్యంలో డెత్ సర్టిఫికెట్ల అవినీతి మకిలిని బీఆర్‌ఎస్ నేతలకు అంటించాలని చూశారు. అవినీతి అక్రమాలను కాంగ్రెస్ నేతలపై మోపే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ నేతలను కాపాడటానికీ తననూ అక్రమ సర్టిఫికెట్ల కేసులో ఇరికించారని, కారోబార్ మీడియా ముఖంగా బయటపెట్టారు.

అంతే కాకుండా సర్టిఫికెట్ల దందా సూత్రధారులను ఈ కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు చూపిన తాపత్రేయం అంతా ఇంతా కాదు. కారోబార్ పోలీసుల వేధింపులను వెల్లడించిన తీరు విదితమే. కాగా కాంగ్రెస్ నాయకులను  కాపాడేందుకు పోలీసుల నుంచి కారోబార్ తీవ్ర బెదిరింపులకు గురయ్యాడు..? ఎదురు తిరిగిన పాపానికి కారోబార్ ఇదే కేసులో ఇరికించబడి జైలుకు వెళ్ళాడు. బడా నేతల అవినీతి అక్రమాలకు ఉద్యోగులు బలిపశువులుయ్యారు. బెల్లంపల్లిలో  వెలుగుచూసిన ఈ సర్టిఫికెట్ల వ్యవహారం మంచిర్యాల, రామగుండం మునిసిపల్ కార్పొరేషన్లకు విస్తరించింది.. మూలాలు మాత్రం ఇక్కడే ఉన్నాయి.

మూలపురుషులు బెల్లంపల్లి వాసులే. అక్రమ సంపాదనకు అలవాటు పడిన నేతలు బయటపడేదాకా అక్రమ సర్టిఫికెట్ల బాగోతాన్ని నడిపించారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారం మాటున సాగించిన దందాలో అధికారులను బలిచ్చి తాము మాత్రం సేఫ్ జోన్ లో ఊడిపోయారన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతున్నది. ఐదుగురు అరెస్టు, ఒకరి పరారితోనే ఈ కేసు ముగిసే పరిస్థితీ కనిపించడం లేదని సమాచారం. ఈ కేసులో అసలు దోషులను రాబట్టేందుకు పోలీసులు విచారణను లోతుగా చేసే అవకాశ ఉందని తెలుస్తోంది.

అవసరమైతే రిమాండ్ లో ఉన్న ఐదుగురినీ కోర్టు అనుమతితో జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకొనే యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే డెత్ సర్టిఫికెట్ల సూత్రధారులను కాపాడటం ఎవరి తరం కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా భావించే పరిస్థితి  కనిపిస్తున్నది. సర్టిఫికెట్ల ఊబిలో ఎవరెవరూ ఉన్నారు.. ఏ స్థాయి లీడర్లు, ఇందులో ఇంకెవరైనా అధికారులు ఉన్నారా..? అనే చర్చ ఉత్కంఠతను రేపుతుంది. మలి దశ విచారణలో పోలీసులు ఏమి చేస్తారో.. దోషులను పట్టుకొంటారో..! లేదో.. చూడాలి మరి..

మరిన్ని వార్తలు