మిషన్ భగీరథ.. తాగునీటికన్నీటి కథ..!
బెల్లంపల్లి: మిషన్ భగీరథ పథకం(Mission Bhagiratha Scheme) నిర్వహణ, పర్యవేక్షణ లోపంతో అనునిత్యం తాగునీటి సరఫరా లో ఆటంకాలు పరిపాటు అయ్యాయి. మిషన్ భగీరథ పథకం అవరోధాలు లేకుండా సక్రమంగా ప్రజల కు తగినీరు అందించినా దాఖలాలు లేవు. కన్నాల బస్తీ ప్రధాన రహదారిలో పైపు లైన్ చెడిపోయి పది రోజులు గడిచిందింది..ఇప్పటికీ మరమ్మతులు పూర్తి కాలేదు. పట్టణానికి నీటి సరఫరా కోసం వేసిన ప్రధాన లైన్. ఈ పైపు లైన్ ద్వారా కన్నాల బస్తీ నుంచి బజార్ ఏరియా వరకూ తాగునీటి ను సరఫరా చేస్తారు.
ఎనిమిది వార్డుల పరిధిలో నీ ప్రజలు గత పది రోజులుగా తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. మునిసిపల్ పాలక మండలి, మిషన్ భగీరథ పథకం నిర్వహణ అధికారులు ఏమిచేస్తున్నారన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. కన్నాల బ్రిడ్జి వద్ద చెడిపోయి పైపులైన్ మరమ్మతులు చేసే వారే లేరన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. పైపు లైన్ మరమ్మత్తులు ఇంకా చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యం కదా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తాగునీరు సరఫరా నిలిచిపోయి ప్రజలు గగ్గోలు పడుతున్నారు. అయినప్పటికీ మరమ్మత్తులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉండిపోయాయి. పట్టణానికి గుండెకాయ వంటి బజారు ఏరియా కు తాగునీటి సరఫరా నిలిచి పోవడం తో అల్లకల్లోలం రేగుతున్నదీ. మిషన్ భగీరథ పథకం పనితీరు పై ప్రజల్లో అగ్రహ వేశాలు కట్టలు తెంచుకున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కాకుంటే, పైపు లైన్ మరమ్మత్తులు ఎంతకానికి పూర్తి అవుతాయని ప్రశ్నిస్తున్నారు. ప్రజల అవసరాలు అధికారులు అంతగా పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి.
సకాలంలో మరమ్మతులు పూర్తి తాగునీటినీ అందించాలానే కనీస బాధ్యత మునిపల్ అధికారులలేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి..పట్టణంలో ఏదోక చోట ఎప్పుడూ మిషన్ భగీరథ పథకం పైపు లైన్లు చెడిపోవడం, పదిహేను రోజుల పాటు ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పవు. చెడిపోయి పైపులైన్ల ను శీఘ్ర గతిన రిపేరు చూపించిన ఘటనలు లేవని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు..ఇప్పటికైనా త్వరిత గతిన రిపేరు పనులు చేపించే విధంగా అధికారులు కాసింత చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు.