తండ్రిని కోల్పోయి కన్నీరుమున్నీరైన పిల్లలు
28-11-2026 | 07:02pm
తరిగొప్పుల, నవంబర్ 28 విజయక్రాంతి : సోలిపూర్‌లో సెంట్రింగ్ పనిలో(Centering work) విద్యుత్ షాక్‌కు(Electric shock) గురై అబ్దుల్ నాగారం గ్రామానికి చెందిన తీగుళ్ల అశోక్ (46) మృతి చెందాడు. అశోక్‌కు భార్య నరసవ్వ, ఐదుగురు చిన్న పిల్లలు ఉన్నారు. శనివారం జరిగిన దహన సంస్కారాల్లో "నాన్నా.. నాన్నా.." అంటూ చిన్నారులు బోరున విలపించిన తీరు అందరి గుండెలను పిండేసింది. కూలీ పనితోనే కుటుంబాన్ని పోషిస్తున్న అశోక్ మృతితో కుటుంబం రోడ్డున పడింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.