దీక్షా దివాస్ ను దిగ్విజం చేయండి

28-11-2026 | 07:04pm

కొత్తగూడెం నవంబర్ 28 విజయక్రాంతి : టిఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)  స్వరాష్ట్ర సాధన కోసం దీక్షబూనిన రోజు నవంబర్ 29 న దిక్షా దివస్(Diksha Divas) జరుపుకోవాలని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పిలుపునిచ్చారు. ఆ మేరకు 29- 11-2026న ఉదయం 9.30 గంటలకు కొత్తగూడెం నియోజకవర్గ(Kothagudem Constituency) స్థాయి దీక్షా దివస్ సభ కొత్తగూడెం బిఆర్ఎస్  పార్టీ కార్యాలయంలో(Kothagudem BRS Party Office) జరుపనున్నారు. 

మాజీ మంత్రి, నియోజకవర్గ ఇంచార్జి  వనమా వెంకటేశ్వర రావు అధ్యక్షతన జరిగే ఈ సభలో  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, తక్కెళ్లపల్లి రవీందర్ రావు , బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర  ముఖ్య అతిధులుగా పాల్గొన ఉన్నారు. ఈ సభకు  గ్రామ పార్టీ భాద్యులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని, దీక్ష దివాస్ ను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు.

మరిన్ని వార్తలు