డంప్ యార్డు తొలగింపునకు 7వ రోజు దీక్షలు

28-11-2026 | 06:56pm

ఎంపీ ఈటల  డీసీసీ అధ్యక్షులు  వజ్రేష్ యాదవ్ లు అండగా నిలబడాలి

డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి విజ్ఞప్తి

జవహర్ నగర్, నవంబర్ 28 (విజయక్రాంతి): జవహర్ నగర్ డంపింగ్ యార్డు(Jawahar Nagar Dumping Yard) ఎత్తివేత కోసం నవంబర్ 22న ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి. చెన్నాపురం క్రాస్ రోడ్డులో పి. శివబాబు ఐఎఫ్‌టీయూ, వై. మల్లేష్ ఏఐఎఫ్‌టీయూ, జర్నలిస్ట్ కొన్నె వేణు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి మాట్లాడుతూ

ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Chamakura Malla Reddy) మాత్రమే దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారని గుర్తుచేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.40 లక్షల మంది ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajender), కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కూడా పార్టీలకు అతీతంగా శిబిరానికి విచ్చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.సంఘీభావం తెలిపిన 

ఏడో రోజు దీక్షలో కళ్ళెపు నర్సయ్య, వేముల యాదగిరి, కనకం ఆంజినేయులు, దర్శనం యాదగిరి, జి. వెంకటేశ్వర్లు, బి. అనసూయ, ఎస్. కనకమ్మ, ఎస్. స్వరూప, మహ్మద్ మొయినుద్దీన్ తదితరులు పూలమాలలు ధరించి కూర్చున్నారు. వీరికి టియుజేఏసి బాన్సువాడ రాజు, బిర్రు యాకస్వామి బీఎస్పీ, హేమ సుదర్శన్ జిల్లోజు ఆప్,ఏ.బాబులాల్ పవర్, వడ్డెర నర్సన్న, వి. ప్రవీణ్ టీయూసీఐ, జయసుధ పీఓడబ్ల్యూ,డి. స్వరూప, బండకింది సింగరయ్య గౌడ్ తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు. నాలుగు మండలాల పరిధిలోని ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, మేధావులు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని నేతలు పిలుపునిచ్చారు. డంపింగ్ యార్డు ఎత్తివేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు