పెద్దదర్పల్లిలో మత్స్యకారులకు పనిముట్ల పంపిణీ
28-11-2026 | 06:56pm
హన్వాడ: మండలంలోని పెద్దదర్పల్లి గ్రామంలో సర్పంచ్ గుముడాల దీప్తిరఘురాం గౌడ్(Sarpanch Gumudala Deepthi Raghuram Goud) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం(Pradhan Mantri Vishwakarma Scheme) కింద అర్హులైన మత్స్యకారులకు పనిముట్ల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు చేతివృత్తుల వారి ఆర్థిక అభివృద్ధికి, స్వావలంబనకు దోహదపడతాయని తెలిపారు. ఎంపీ డీకే అరుణ సూచన మేరకు అర్హులకు పథకంపై అవగాహన కల్పించి దరఖాస్తులు చేయించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.