వ్యాపారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి

11-11-2026 | 05:11pm

కలెక్టర్ కుమార్ దీపక్ 

భీమారం (జైపూర్), (విజయక్రాంతి): ఎల్ నినో పరిస్థితులలో బియ్యం వ్యాపారులు మానవతా దృక్పథంతో వ్యవహరించి ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో సమత రైస్ డిపో వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా పౌర సరఫరాల అధికారి వేణుగోపాల్, మండల తహసిల్దార్ సదానందంలతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల ప్రస్తుతం మార్కెట్ లో నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు అందరూ మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచాలని, తనిఖీల కోసం వచ్చే బృందాలకు వ్యాపారులు, ట్రేడర్లు సహకరించాలని తెలిపారు. 26 కిలోల బరువుతో కూడిన బి.పి.టి. బియ్యం బ్యాగ్ ను రూ. 1,352కు, బి.పి.టి. స్టీమ్ బియ్యం రూ. 1,482కు, బి.పి.టి. పాత బియ్యం రూ. 1,638 కు, హెచ్.ఎం.టి. పాత బియ్యం బస్తా రూ. 1,950 కు, జె.ఎస్.ఆర్. పాత బియ్యం రూ. 1,976 చొప్పున అవుట్ లెట్ ద్వారా నిబంధనల ప్రకారం విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు.

మరిన్ని వార్తలు