చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
లబ్ధిదారులకు అండగా ప్రజా ప్రభుత్వం :ఆర్. సంతోష్ కుమార్
వేమనపల్లి,( విజయక్రాంతి ): పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ జడ్పీటీసీ సభ్యులు(Former ZPTC members) ఆర్. సంతోష్ కుమార్ అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి(MLA Gaddam Vinod Venkataswamy) ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఆయన ప్రజాప్రతినిధులు,
అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, నిరుపేదలకు పింఛన్లు ఆర్థిక భరోసాతో పాటు కొండంత అండగా నిలుస్తున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అర్హులకు చేరుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, నీల్వాయి సర్పంచ్ చెన్నూరి సమ్మయ్య, ఎంపీడీవో కుమారస్వామి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సాబీర్ అలీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి మధు, పలువురు సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.