కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ పట్టణ అధ్యక్షుడిగా మహేష్

18-11-2026 | 01:25pm

చెన్నూర్,(విజయక్రాంతి): నియోజకవర్గ కేంద్రం చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధ్యక్షుడిగా లింగపల్లి మహేష్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘునాథరెడ్డి(Pinninti Raghunatha Reddy) నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ అధ్యక్షుడిగా  నియామక పత్రాన్ని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) మహేష్ కు అందజేశారు.

పార్టీ బలోపేతం కోసం పని చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరేలా చూడాలని సూచించారు. తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్షుడిగా బాధ్యత అప్పగించిన  మంత్రికి,జిల్లా అధ్యక్షుడికి ఈ సందర్భంగా మహేష్ కృతజ్ఞతలు తెలిపాడు.

మరిన్ని వార్తలు