టీఎన్జీవో వైపు ఉద్యోగుల అడుగులు

28-11-2026 | 07:45pm

రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యం

జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి

మంచిర్యాల: ( విజయక్రాంతి ) : టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం(TNGO Membership Registration Program) మంచిర్యాల జిల్లాలో(Mancherial District) జోరుగా సాగుతోంది. జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్(Mancherial Municipal Corporation) కార్యాలయంలో పనిచేస్తున్న మున్సిపల్ ఎస్‌జే శాఖకు చెందిన 104 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు(Non-gazetted employees) టీఎన్జీవో సంఘంలో సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీఎన్జీవో సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

జిల్లాలో సభ్యత్వ నమోదు ప్రక్రియ తుది దశకు చేరుకుందని, త్వరలోనే పూర్తి చేసి రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదులోనే కాకుండా ఉద్యోగుల సంక్షేమం, సంఘటిత శక్తిలోనూ మంచిర్యాల జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు జాడి రామ్ కుమార్, తంగళ్లపల్లి తిరుపతి, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్‌తో పాటు మున్సిపల్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు