డిగ్రీ కళాశాలలో విద్యార్థిని ప్రసవం
ఘటనకు కారకుడైన వ్యక్తి అరెస్ట్
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలోని ఓ గురుకుల డిగ్రీ కాలేజీ హాస్టల్ బాత్రూంలో(gurukul college hostel bathroom) విద్యార్థిని ప్రసవించిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ రిమాండ్కు తరలించారు. హాస్టల్ బాత్రూంలో ఒక యువతి బిడ్డకు జన్మనిచ్చిన ఘటనకు సంబంధించి మొదట మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో(Mahabubabad Town Police Station) జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.
అనంతరం సంఘటన జరిగిన ప్రదేశం మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో, పాయింట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ప్రకారం కేసును మరిపెడ పోలీస్ స్టేషన్కు బదిలీ చేయడం జరిగింది. ఈ కేసులో విద్యార్థిని గర్భవతి కావడానికి కారకుడని, ఖమ్మం జిల్లాకు చెందిన బానోత్ శ్యామ్ ప్రసాద్ పై కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి, శనివారం రిమాండ్ కు తరలించినట్లు మరిపెడ సిఐ ఎల్.పవన్ కుమార్ తెలిపారు.