తుంగతుర్తి స్వేరోస్ మండల నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా జిలకర పరుశురాములు.. ప్రధాన కార్యదర్శిగా జాజుగల్ల రమేష్
స్వేరోయిజం సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి విస్తరించాలి: మచ్చ నరసయ్య, కొండగడుపుల ఎల్లయ్య
తుంగతుర్తి, (విజయ క్రాంతి): తుంగతుర్తి మండల స్వేరోస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ సూచనలతో జిల్లా కమిటీ అధ్యక్షుడు పిడమర్తి దశరథ ఆదేశాల మేరకు, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మచ్చ నర్సయ్య సమక్షంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగడుపుల ఎల్లయ్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మండల నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. నూతన మండల అధ్యక్షుడిగా జిలకర పరుశరాములు, ప్రధాన కార్యదర్శిగా జాజుగల్ల రమేష్, అధికార ప్రతినిధిగా కాసర్ల రాజశేఖర్, కోశాధికారిగా పుల్లూరు పరుశురాములు, ప్రేరణ ఇన్చార్జిగా కొండగడపల నవీన్, ఉపాధ్యక్షులుగా గుడిపాటి కోటేశ్వర్, చింతకుంట్ల భాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుండగాని మహేష్, కార్యదర్శులుగా పసుపులేటి రవిశంకర్, మాచర్ల యాకయ్య, వెంపటి రమేష్ ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా మచ్చ నరసయ్య, కొండగడుపుల ఎల్లయ్య మాట్లాడుతూ.. బహుజన అక్షర యోధుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాపించిన నెట్వర్క్ లో స్వేరోస్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి విస్తరించాల్సిన బాధ్యత ప్రతి స్వేరో బిడ్డపై ఉందన్నారు. స్వేరోయిజం ప్రధాన నినాదాలైన అక్షరం – ఆర్థికం – ఆరోగ్యం – ఆత్మగౌరవం అనే నాలుగు మూల సూత్రాలతో సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని ప్రతి గ్రామంలో స్వేరోస్ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, విద్య, ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యం, ఆత్మగౌరవం దిశగా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. నూతన కమిటీ సభ్యులు సమష్టిగా పనిచేస్తూ స్వేరోస్ ఉద్యమ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.