గ్రామాల్లో వైద్య శిబిరాలు

28-11-2026 | 07:30pm

 ఉట్నూర్, (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండల(Indravelly Mandal) పరిధిలోని గిన్నెరా, బొప్పాపూర్ గ్రామాలలో పరిమళ గ్రూప్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. వైద్య శిబిరంలో భాగంగా గ్రామ ప్రజలకు బీపీ, షుగర్, టీబీ తదితర వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. టీబీ వ్యాధి అనుమానితులను గుర్తించి, వారికి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ పవార్ సురేష్  మాట్లాడుతూ, గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని(Medical Camps) సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ అవసరమైన రక్త పరీక్షలు మరియు ఎక్స్‌రే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

కార్పొరేట్ ఆసుపత్రులలో వేల రూపాయలు ఖర్చయ్యే ఈ పరీక్షలను ప్రజల ఇంటి వద్దకే వచ్చి ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ పరీక్షల ద్వారా శరీరంలో ఏవైనా వ్యాధులు ఉన్నట్లయితే ముందుగానే గుర్తించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించడం జరుగుతుందని వివరించారు. అలాగే, చలికాలంలో దగ్గు, దమ్ము మరియు శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, దీర్ఘకాలిక దగ్గు ఉన్నవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిమళ గ్రూప్ టీమ్ లీడర్ శరత్, ల్యాబ్ టెక్నీషియన్ అంజయ్య,ఎక్స్‌రే టెక్నీషియన్ స్రవంతి,వైద్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు