సమాజాన్ని మార్చే శక్తి విద్యతోనే సాధ్యం
సిరికొండ నవంబర్ 28(విజయ క్రాంతి ): సమాజాన్ని మార్చే శక్తి విద్యతోనే సాధ్యమని తెలంగాణ విశ్వ విద్యాలయ(Telangana University) ప్రో. డాక్టర్ పున్నయ్య అన్నారు. సిరికొండ మండల(Sirikonda Mandal) కేంద్రంలోని సత్య శోధక్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ రావుట్ల(Satya Shodhak Education Society Chairman Raotu) ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే(Mahatma Jyotiba Phule) 136వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.200ఏళ్ల క్రితం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని సమాజ మార్పుకు ఎందరో సంస్కర్తలు కృషి చేశారని అన్నారు.
పూలే పేరుతో ఓ పాఠశాలను నెలకొల్పి మంచి విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు అనుదినం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. దేశంలో విప్లవోద్యమ నా oది పలికిన మహనీయులు పులేనేనని అన్నారు.విద్యార్థులు నేటి ప్రపంచానికి దిక్సూచిగా నిలవాలంటే శాస్త్రవేత్తలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అసిస్టెంట్ పాఫెసర్ వాసిం చంద్రశేఖర్ అన్నారు.దేశంలో శాస్తవ్రేత్తలు కావడం కోసం ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయని అన్నారు. పూలే అందించిన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
అసమానతలు రూపుమాపి దేశానికి దిక్సూచిగా నిలిచారని ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడు.పూలే వర్ధంతి సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికను అందజేశారు. పది ప్రక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి నగదు జ్ఞాపికను అందజేశారు.విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి.కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ రావు, జక్రాన్ పల్లి ఎంఈవో శ్రీనివాస్, డిటిఎఫ్ నాయకులు బాలయ్య, సోల్మన్, శ్రీనివాస్, ప్రసాద్, సిబ్బంది ఉన్నారు.