అనంతగిరి అయ్యప్ప సన్నిధిలో ఘనంగా అన్నప్రసాద వితరణ
కోదాడ,(విజయక్రాంతి): అనంతగిరి(Anantagiri )లోని అయ్యప్ప సన్నిధి(Ayyappa Temple)లో నిర్వహిస్తున్న నిత్యాన్నప్రసాద వితరణ కార్యక్రమం శనివారం 53వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన సుమారు 250 మందికి పైగా అయ్యప్ప స్వాములు అన్నప్రసాదాన్ని స్వీకరించారని నిర్వాహకులు తెలిపారు. ఈ అన్నప్రసాద వితరణ(Annaprasadam distribution) కార్యక్రమానికి మహారాజ పోషకులతో పాటు కోదాడ పట్టణానికి చెందిన గండికోట పవన్-చంద్రిక దంపతులు, పులిగండ్ల శ్రీనివాసరావు-లక్ష్మీ దంపతులు, పులిగండ్ల మౌనిక్ కుమార్-పావని దంపతులు దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఈదుల యాదగిరి గురుస్వామి, అయితనబోయిన వెంకటేశ్వర్లు, జంగా శ్రీను, గరిడేపల్లి శ్రీను, కనకయ్యతో పాటు పలువురు అయ్యప్ప భక్తులు, దాతలు పాల్గొన్నారని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.