గుంటి రఘునాథ స్వామి ఆలయంలో వైభవంగా పంచామృతాభిషేకం

28-11-2026 | 07:32pm

కోదాడ(విజయక్రాంతి): కోదాడ పట్టణంలోని గుంటి రఘునాథ స్వామి దేవస్థానంలో శనివారం శ్రీరామచంద్రుని పునర్వసు జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం గుట్టపై వెలసిన స్వయంవ్యక్త పట్టాభి రామచంద్ర స్వామికి పంచసూక్తములచే పంచామృత అభిషేకాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారిణి కిలారు సీత-శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవం కొనసాగింది.

ఈ కార్యక్రమంలో వేనేపల్లి శ్రీనివాసరావు దంపతులు, స్వామి ఫణి కుమార్-మానస దంపతులు, బొబ్బిలి లచ్చిరెడ్డి, వల్లభనేని పాపారాణితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతి మాసంలో వచ్చే శ్రీరామచంద్రుని పునర్వసు జన్మ నక్షత్రం రోజున ఆలయంలో అభిషేకం, ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తామని ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గుంటి రఘునాథుని అనుగ్రహానికి పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.

మరిన్ని వార్తలు