మార్నింగ్ వాక్‌లో ప్రజా సమస్యల పరిశీలన

18-11-2026 | 01:13pm

చెన్నూర్,(విజయక్రాంతి):  మంచిర్యాల జిల్లా తన నియోజకవర్గం చెన్నూరులో  రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి  బుధవారం  మార్నింగ్ వాక్ లో ప్రజల సమస్యలను  అడిగి తెలుసుకున్నారు.పట్టణంలోని పలు వార్డుల్లో కాలినడకన కలియతిరిగి, పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలపై ఆరా తీసిన మంత్రి,వార్డుల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత మున్సిపల్ అధికారులకు సూచించారు.

అనంతరం ముస్లిం మైనారిటీ వర్గాల చిరకాల కోరిక మేరకు ఖబ్రస్థాన్ (శ్మశాన వాటిక) కోసం కేటాయించిన స్థలాన్ని స పరిశీలించారు. అవసరమైన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. చెన్నూరు పట్టణంలో ఇటీవల మృతి చెందిన కదారి సుజాత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి వెంట మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు