చలో ఉస్మానియాకు భారీగా తరలిన నేతకాని సంఘం నాయకులు
జన్నారం (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన నేతకాని సంఘం నాయకులు, కార్యకర్తలు ఆదివారం చలో ఉస్మానియా (Chalo Osmania) సభకు భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. నేతకాని కులస్తుల సమస్యలు, హక్కులు, సంక్షేమ అంశాలపై హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) క్యాంపస్‌లో నిర్వహించనున్న భారీ సభలో పాల్గొనేందుకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక బస్సుల్లో (Special Buses) హైదరాబాద్‌కు పయనమయ్యారు.
నేతకాని సామాజిక వర్గ సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై నిర్వహించే ఈ సభలో పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా తరలివెళ్లారు.