రాజ్యాంగం పట్ల విద్యార్థులకు అవగాహన అవసరం
మెదక్ ఎంపీ రఘునందన్ రావు
చేగుంట, నవంబర్ 28:నవంబర్ విజయక్రాంతి : విద్యార్థులకు(Students') భారత రాజ్యాంగంపై(Constitution of India) పూర్తి అవగాహన ఉండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Medak MP Raghunandan Rao) అన్నారు. చేగుంట మండల(Chegunta Mandal) కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(PM SHRI Zilla Parishad High School) సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చల్లా లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఫొటో గ్యాలరీని శనివారం ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన మెకాలే విద్యా విధానానికి స్వస్తి పలికి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగంలోని హక్కులు, విధులపై విద్యార్థులకు చిన్ననాటి నుంచే అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలో రాష్ట్రపతి, గవర్నర్ వంటి రాజ్యాంగబద్ధ పదవులకు ఎంతో ప్రాధాన్యత ఉందని, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చట్టాల రూపకల్పన జరుగుతుందని వివరించారు.
రాజ్యాంగ పరిషత్ సభ్యుల వివరాలను సేకరించి వారి చిత్రాలతో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఉపాధ్యాయుడు చల్లా లక్ష్మణ్‌ను ప్రశంసించారు. వందేమాతరం గీతాన్ని అవమానించే చర్యలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు ఉన్నతంగా చదివి మంచి ఫలితాలు సాధించినప్పుడే ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చేగుంట ఎంఈఓ నీరజ, డీఈఓ రాజు, చేగుంట సర్పంచ్ సండ్రంగు స్రవంతి, ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీ, ఉపాధ్యాయులు రాజేశ్వర్, రఘుపతి, రాధ, రమా, రమాదేవి, సురేందర్, మనోహర్ రావు, రావుల వెంకటేష్, సరస్వతి, శ్రీవాణి, రేఖ, ఉమా, ఉమామహేశ్వరి, హిమవర్ష, సీఆర్పీ రమేష్, తపస్ రాష్ట్ర, జిల్లా బాధ్యులు నవాత్ సురేష్, రంగారెడ్డి, ఎల్లం, సిద్ధు, బీజేపీ మెదక్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు వాల్దాస్ బాల్లేష్ గౌడ్, బైరి శంకర్ ముదిరాజ్, బీజేపీ చేగుంట మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, ఉపాధ్యాయులు విఠల్ రెడ్డి, నరసింహారావు, పెంట గౌడ్ తదితరులు పాల్గొన్నారు.