కాంగ్రెస్ గ్రామ అధ్యక్షునిగా ముత్యం గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక..

07-10-2026 | 10:19pm

తూప్రాన్, అక్టోబర్ 7, (విజయక్రాంతి): తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షునిగా చింతకింది ముత్యం గౌడ్(Muthyam Goud) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ నేత చిట్కుల మహిపాల్ రెడ్డి గతంలో ముత్యం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవను గుర్తిస్తూ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ముత్యం గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి నాకు ఇచ్చిన ఈ పదవిని సొంత లాభాపేక్ష చూసుకోకుండా పార్టీ కార్య కలాపాలలో తూచా తప్పకుండా పాల్గొంటూ పార్టీ బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో పిసిసి సీనియర్ నేత బండారి శ్రీకాంత్ రావ్, కాంగ్రెస్ సీనియర్ నేత ఉమ్మన్నగారి భాస్కర్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, తూప్రాన్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బి వెంకట్ గౌడ్, భుజరు మహేష్ గౌడ్, బంజే శ్రీకాంత్, భాగి శ్రీను, సొల్లుగారి రవి, కే హరి, మన్నె ప్రశాంత్, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు