బియ్యంలో పురుగులు..!

26-11-2026 | 05:25am
  1. అంగన్వాడీ కేంద్రానికి పురుగులు పట్టిన బియ్యం సరఫరా
  2. వారం క్రితమే కేంద్రానికి సరఫరా అయిన రైస్
  3. పలు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి 
  4. ఈ బియ్యం తింటే చిన్నపిల్లల పరిస్థితి ఏంటి?

పాపన్నపేట, నవంబర్ 25: పాపన్నపేట మండల(Papannapet Mandal) కేంద్రంలోని అంగన్వాడి కేంద్రానికి(Anganwadi Center) పురుగులు పట్టిన బియ్యం సరఫరా చేశారు. కేంద్రానికి బియ్యం సరఫరా(Rice supply) చేసి వారం రోజులే అవుతుందని, బుధవారం నూతన బియ్యం సంచి తెరిచి వంట చేద్దామనేసరికి పురుగులు ఉన్నాయని కేంద్రం ఆయమ్మ, కార్యకర్త వాపోయారు. ఇలాంటి బియ్యం తింటే బ్యాక్టీరియా(Bacteria) శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు.

అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నాణ్యమైన బియ్యం, నాణ్యమైన వస్తువులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి బియ్యం తిని పిల్లలకు ఏమైనా సమస్య ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడుతున్నారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు..

 పిల్లలకు సరఫరా చేసే బియ్యంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ మధ్యకాలంలో మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పురుగులు పట్టిన బియ్యం సరఫరా అవుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలి..

పురుగులు పట్టిన బియ్యం తింటే పిల్లలకు అనారోగ్య సమస్యలు ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నాణ్యమైన బియ్యం, నాణ్యమైన సరుకులు విద్యార్థులు, పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 పరిశీలించి చర్యలు తీసుకుంటాం : సతీష్ కుమార్, తహసీల్దార్

 ఇదే విషయమై పాపన్నపేట తహసిల్దార్ సతీష్ కుమార్ ను సంప్రదించగా.. అంగన్వాడి కేంద్రానికి వెళ్లి పరిశీలిస్తానని, ఇకపై అలా జరగకుండా తగు చర్యలు తీసుకుంటానని తహసిల్దార్ సతీష్ కుమార్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు