జవహర్ నగర్ అభివృద్ధికి చిరునామా.. గత ప్రభుత్వపు అభివృద్ధి పనులే

22-11-2026 | 07:55pm

కాంగ్రెస్ వచ్చింది... కరువు తెచ్చింది.                              

కాంగ్రెస్ వాళ్లు వార్డులోకి వస్తే తరిమి పంపండి.                      

మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి.                            

జవహర్ నగర్, నవంబర్ 22 (విజయక్రాంతి): జవహర్ నగర్ అభివృద్ధికి చిరునామాగా... గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులేనని కాంగ్రెస్ వచ్చింది జవహర్ నగర్ లో కరువు తెచ్చిందని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి(Former Minister Chamakura Mallareddy) పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి సమక్షంలో జవహర్ నగర్ డివిజన్లోని కేఎన్ఆర్ నగర్ పరిధిలోనీ నోబుల్ హైస్కూల్ దగ్గర జరిగిన పార్టీ కార్యక్రమంలో జవహర్ నగర్ కు చెందిన వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు దాదాపుగా 150 మంది ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

జవహర్ నగర్ డివిజన్ పరిధిలోని నోబుల్ హైస్కూల్ వద్ద జరిగిన నూతన కార్యకర్తల చేరిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరై మాట్లాడుతూ జవహర్ నగర్ అభివృద్ధికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషియే నని జవహర్ నగర్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. జవహర్ నగర్ లో నెలకొన్న డంపింగ్ యార్డ్ వల్ల గత 25 ఏళ్ల నుండి ప్రజలు వాయు కాలుష్యం గాలి కాలుష్యం నీటి కాలుష్యం చివరకు తినే తిండి కాలుష్యపు కొరలో చిక్కుకొని బతుకు వెల్లదీస్తున్నారన్నారు.

రాష్ట్రంలో రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వంలో జవహర్ నగర్ సర్వతో ముఖా అభివృద్ధిని సాధిస్తుందని జోష్యం చెప్పారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీలో చేరిన పొలాస అశోక్ ,రాజేశ్వర్, రాము, మామిడిపల్లి పరమేష్ చారి, ప్రభాకర్, రాజు, హరీష్, అజీమ్, అరవింద్, సంజయ్, సంపత్ ,అనిల్, గణేష్, సంతోష్, వంశీ, తోపాటు దాదాపుగా 150 మంది కార్యకర్తలు మల్లారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జి చామకూర మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల ముదిరాజ్, మాజీ మేయర్ మేకల కావ్య, మాజీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు