విద్యార్థుల ప్రతిభకు ఒలంపియాడ్, చెకుముకి పోటీలు

22-11-2026 | 07:55pm

* ఇంగ్లీష్ ఒలంపియాడ్, టిఈడి-ఈడి టాక్, చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ

* విజేతలు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక

గరిడేపల్లి, నవంబర్ 22 (విజయక్రాంతి) : విద్యార్థుల్లో(students) దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన మండల స్థాయి ఇంగ్లీష్ ఒలంపియాడ్(Mandal-level English Olympiad), టిఈడి-ఈడి టాక్ ఉపన్యాస పోటీలు(TED-Ed Talk Competitions), చెకుముకి టాలెంట్ టెస్ట్ కార్యక్రమాలను(Chekumuki Talent Test programs) మండల విద్యాధికారి పానుగోతు ఛత్రు నాయక్ ఆదివారం గరిడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(Zilla Parishad High School, Garidepalli) ప్రారంభించారు. ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

ఇంగ్లీష్ ఒలంపియాడ్ విజేతలు:

జూనియర్స్ విభాగంలో కీతవారిగూడెం జడ్పీహెచ్ఎస్‌కు చెందిన మెరీనా ప్రథమ బహుమతి, గడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్‌కు చెందిన కె. జస్వంత్ ద్వితీయ బహుమతి సాధించారు. సీనియర్స్ విభాగంలో రాయినిగూడెం జడ్పీహెచ్ఎస్‌కు చెందిన ఆర్. రిషిత ప్రథమ బహుమతి, గానుగబండ జడ్పీహెచ్ఎస్‌కు చెందిన బి. గిరిష్మా ద్వితీయ బహుమతి పొందారు.

టిఈడి-ఈడి టాక్ ఉపన్యాస పోటీల విజేతలు:

జూనియర్స్ విభాగంలో కీతవారిగూడెం జడ్పీహెచ్ఎస్‌కు చెందిన మెరీనా ప్రథమ బహుమతి, కల్మలచెరువు జడ్పీహెచ్ఎస్‌కు చెందిన కె. ముకుంద ప్రియా ద్వితీయ బహుమతి సాధించారు. సీనియర్స్ విభాగంలో రాయినిగూడెం జడ్పీహెచ్ఎస్‌కు చెందిన కె. కావ్యశ్రీ ప్రథమ బహుమతి, గరిడేపల్లి జడ్పీహెచ్ఎస్‌కు చెందిన పి. హిందూ ,సుస్మిత ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు.

చెకుముకి టాలెంట్ టెస్ట్ విజేతలు:

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విభాగంలో కల్మలచెరువు జడ్పీహెచ్ఎస్‌కు చెందిన సీహెచ్. మహేష్, ఎస్.కె. షరీష్, కె. ముఖేష్ ప్రథమ విజేతలుగా నిలిచారు. రెసిడెన్షియల్ పాఠశాలల విభాగంలో గరిడేపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన మానస, భవ్యశ్రీ, లిఖిత విజేతలుగా నిలిచారు.

ప్రైవేట్ పాఠశాలల విభాగంలో పొనుగోడు సెయింట్ జోసెఫ్ పాఠశాలకు చెందిన విజయ, శివకీర్తి, జీవన్ విజయం సాధించారు.ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు తదుపరి జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయులు టి. వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, అమలారాణి, శ్రీను, చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహణలో జె. సాయిల్, శోభన, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు