ఆర్థిక భరోసా అందించేందుకే ఇందిరమ్మ బీమా..

22-11-2026 | 07:57pm

అడవిదేవులపల్లి బీమా నమోదు పరిశీలన...

దామరచర్ల నవంబర్ 22: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Battula Laxmareddy) చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడంతో పాటు ఆర్థిక భరోసా అందించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. అడవిదేవులపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు.

మండల కేంద్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులైన కుటుంబాల వివరాలను సేకరించి, ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందేలా , నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిన్నరామయ్య ,కార్యదర్శి దుర్గయ్య తోపాటు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు ,శ్రీనివాస్ , బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు