భార్యను హత్య చేసిన భర్త
మఠంపల్లి అక్టోబర్ 07(విజయ క్రాంతి): మండలంలోని పెదవీడు గ్రామానికి(Pedaveedu village) చెందిన దేశబోయిన అచ్చయ్య తన భార్య చంద్రకళ (35) ను కుటుంబ కలహాల కారణంగా మంగళవారం రాత్రి 9:00 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్ తో తలపై విచక్షణారహితంగా కొట్టాడు.
తీవ్ర గాయాలతో పడిపోయిన చంద్రకళను కుమారుడు వరుణ్ తేజ్,స్థానికులు 108 ద్వారా హుజూర్ నగర్ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రశాంతి హాస్పిటల్ కు తరలించారు.చికిత్స పొందుతూ మృతి చెందింది.
మృతురాలికి ఇద్దరు పిల్లలు కూతురు నమ్రత,వర్షిని, కుమారుడు వరుణ్ తేజ్ ఉన్నారు.మృతురాలి తల్లి బుడిగే లక్ష్మి ఫిర్యాదు మేరకు, భర్త దేశబోయిన అచ్చయ్య,అత్త వెంకమ్మ వేధింపులకు గురి చేసేవారని ఆరోపిస్తు కేసు పెట్టారని,నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.