మేడిపల్లి డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

21-11-2026 | 10:30pm

కమిటీ సభ్యుల సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పిలుపు

మేడిపల్లి, నవంబర్ 21 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని 9వ డివిజన్ మేడిపల్లి కాంగ్రెస్ పార్టీని(Medipally Congress Party) మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. శనివారం మేడిపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి(Tungaturthi Ravi) ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ(Congress Party) బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా పార్టీ కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. అనంతరం పార్టీ బలోపేతం, సంస్థాగత అభివృద్ధి, ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెంపొందించే అంశాలపై సభ్యులు చర్చించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు యాసారం మహేష్, చెరుకు మహేష్ గౌడ్, యాసారం నగేష్, కాటపాక కుమార్, ప్రధాన కార్యదర్శులు ముదిగొండ రమేష్, సుదర్శన్ రెడ్డి, సుక్క జయేందర్, దేశగోని శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శులు సింగం లక్ష్మణ్, బొల్గురి నాగరాజు, కార్యనిర్వాహక సభ్యులు వి. సతీష్, మహేశ్వరప్ప, శ్రీనివాస్ కురుమ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు