ఘట్ కేసర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై నెరవేరని హామీలు
- అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై ఉవ్వెత్తున ప్రజాగ్రహం!
- 18 ఏళ్లుగా కొనసాగుతున్న స్థానిక నాయకుల సుదీర్ఘ పోరాటం
- వివిధ రూపాలలో నిరసనలు, నిరాహార దీక్షలు, ధర్నాలతో హోరెత్తుతున్న ప్రజలు
- నేడు ఘట్ కేసర్ పట్టణ బంద్’కు అఖిలపక్షం పిలుపు
ఘట్ కేసర్, నవంబర్ 1 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణ ప్రజల ఏళ్ల నాటి కల అ యిన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం(Construction of a railway overbridge) అధికారులు, కాంట్రాక్టర్ ల తీవ్ర నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారింది. ఒకటి, రెండు ఏళ్లు కా దు. ఏకంగా 18 ఏళ్లుగా బ్రిడ్జి నిర్మాణం అ సంపూర్తిగానే దర్శనమిస్తుండటంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర అవేదన, ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల అలసత్వం, మౌనంపై స్థానిక అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు సమరశంఖం పూరించాయి.18 ఏళ్లుగా స్థానిక ప్రజలు, నా యకులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నా అధికారులు కాంట్రాక్టర్లకు పట్టింపులేకుండా పో యింది. దీంతోఘట్ కేసర్ పరిసర ప్రాంత ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.
అత్యవసర సమయంలో ఆస్పత్రులకు వెళ్లే అంబులెన్సులు, బడి పిల్లల బస్సులు సమయానికి చేరుకోలేకపోతున్నాయి. ఈసమస్య పరిష్కారం కోసం గత 18 ఏళ్లుగా మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజా సంఘాలు అనేక రకాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు.
వినతిపత్రాలు ఇవ్వడం నుంచి మొదలుకొని ధర్నాలు, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేసినా అధికారులు, కాంట్రాక్టర్ల ధోరణిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. నిర్మించి వదిలేసిన పిల్లర్లు, నిలిచిపోయిన నిర్మాణ పనులు చూసి విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి దిగా రు. బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నేడు (సోమవారం) ‘ఘట్కేసర్ పట్టణ బంద్‘
రైల్వే వంతెన నిర్మాణ పనుల జాప్యాన్ని, అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సోమవారం ఘట్ కేసర్ పట్టణ బంద్ కు అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు.
పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు, రవాణా రంగాలు ఈ బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలని అఖిలపక్ష నేతలు కోరా రు. పనులు వేగవంతం చేసి బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి
ఏళ్లు గడుస్తున్నా పూర్తవని ఈ రైల్వే బ్రిడ్జి పనులపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి కాంట్రాక్టర్ తో యుద్ధప్రా తిపదికన పనులు పూర్తి చేయించాలని ఘట్ కేసర్ పట్టణ వాసులు గట్టిగా నిరసన గళం విప్పుతున్నారు.