మహిళా సాధికారత నేపథ్యంలో ఆకాశంలో ఒక తార

18-10-2026 | 05:20am

దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఆకాశంలో ఒక తార’(Akashamlo Oka Tara ). దర్శకుడు పవన్ సాధినేని (Director Pavan Sadineni)తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తే.. ప్రతిభావంతురాలైన విద్యార్థిని కల్పనను ప్రోత్సహించేవారే ఉండరు.

తల్లిదండ్రులు కూడా నిరుత్సాహపరుస్తూ పెళ్లి చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆమె జీవితంలోకి వచ్చిన కృష్ణ ఆమె కలను అర్థం చేసుకుంటాడు. పెద్దగా కలలు కనాలని, లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని ఆమెను ప్రోత్సహిస్తాడు.

డ్రామా, హృదయాన్ని తాకే భావోద్వేగాలు, స్ఫూర్తినిచ్చే సందర్భాలతో హృద్యంగా మలిచిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్; డీవోపీ: సుజిత్ సారంగ్; ప్రొడక్షన్ డిజైన్: శ్వేత సాబు సిరిల్. 


మరిన్ని వార్తలు