ఫహాద్ ఫాజిల్ హీరోగా..
ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్(Prominent actor Fahadh Faasil) హీరోగా మాన్సూన్ మూవీస్‌తో కలిసి వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్(Vels Film International) లిమిటెడ్ బ్యానర్ నిర్మిస్తున్న తాజాచిత్రం ‘అసరీరి’('Asariri'). ఇషారి కే గణేశ్ నిర్మాత. సీ ప్రేమ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శివద, చేతన్, గీత, హరీశ్ ఉత్తమన్, కరుణాకరన్, శరణ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
నూతన సంవత్సర కానుకగా 2027, జనవరి 1న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్ కార్తికేయ నేతృత్వంలోని షోయింగ్ బిజినెస్ సంస్థ విడుదల చేయనుంది. ఈ చిత్రానికి డీవోపీ: మహేంద్రన్ జయరాజు; సంగీతం: గోవింద్ వసంత; యాక్షన్: మహేశ్ మాథ్యూ; ఎడిటర్: ఆర్ గోవిందరాజ్; ప్రొడక్షన్ డిజైన్: కుమార్ గంగప్పన్.