హిట్ జాబితాలో చేరే చిన్న సినిమా ఇది
కిరణ్, రంజిత్, అఖిల రామ్, లావణ్యరెడ్డి, కీర్తి, మన్యం భాస్కర్ కీలక పాత్రలను పోషించిన సినిమా ‘పారడాక్స్ హరికథ(Paradox Harikatha)’. అనుదీప్ రెడ్డి కొతూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు బల్లా, కవిత గోర నిర్మాతలు. ఈ సినిమా డిసెంబర్ 11న రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ‘గుప్పెడంత ప్రేమ’ అంటూ సాగే ప్రేమగీతాన్ని విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు అనుదీప్ రెడ్డి మాట్లాడుతూ.. “ఈ హరికథ సినిమా వినూత్నమైంది. తెలుగు చిన్న చిత్రాల హిట్ జాబితాలో కచ్చితంగా చేరుతుంది. తెలుగు చిత్రాల్లో ఇప్పటివరకు రాని ఒక కొత్త తరహా అంశం ఇందులో ఉంది” అని తెలిపారు. “పారడాక్స్ హరికథ’ గొప్ప చిత్రంగా నిలుస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది” అని నిర్మాత అశోక్ చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ మహవీర్ తదితర చిత్రబృందం పాల్గొన్నారు.