జెన్‌జీ ఆలోచనల సమాహారమే ఐ హేట్ మ్యారేజ్

18-10-2026 | 05:25am

సుగి విజయ్, జుప్సీ భద్ర హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్’(I Hate Marriage). ఆర్య సినిమా బ్యానర్‌పై మాదం దయానంద్, కార్తిక్ వెంపటి నిర్మించారు. ఈ చిత్రంతో పరమేశ్ రేణుకుంట్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హారిక రాజేందర్, సాహితి కృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి, ప్రభావతి, ఆశ్రిత వేముగంటి, లోహిత్ కుమార్, బేబి తమోజ్ఞ, రాధ రాయసం, లక్ష్మి,

జాకీర్, విజయ్ కుమార్, దాసరి పద్మ రేఖ, శ్రీదేవి ఆర్రోజు, మెయిల్ రమేశ్, అరుణ్ కుమార్ రెడ్డి, ఇందు, అఖండ సుధాకర్ రెడ్డి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. “ప్రేమ, పెళ్లి, కెరీర్‌తోపాటు స్వతంత్రంగా జీవించాలనే నేటి జెన్ జీ తరం ఆలోచనలు, భావజాలాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించే ప్రయత్నమే ఈ చిత్రం” అన్నారు. 

మరిన్ని వార్తలు